MBNR: జిల్లా కేంద్రంలోని పిల్లలమర్రి ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో ఈ నెల 30న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మైత్రి ప్రియ తెలిపారు. ఈ మేళాలో మూడు ప్రైవేట్ సంస్థల్లో 200 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయన్నారు. ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులన్నారు. వయస్సు 18 -30 ఏళ్లలోపు ఉండాలన్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.