AP: ఆర్థిక సమస్యలు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం ముందుకెళ్తున్నామని మంత్రి సత్యకుమార్ అన్నారు. మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ కల్పించే దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కొప్పర్తి, ఓర్వకల్లుకు పెట్టుబడులు భారీగా వస్తున్నాయని.. మచిలీపట్నం నుంచి హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ వరకు రోడ్డు వెళ్తుందన్నారు. కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం అందుతోందని వెల్లడించారు.