వరంగల్ జిల్లా కేంద్రంలో సోమవారం PDSU ప్రధాన కార్యదర్శి మైసా శ్రీనివాస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనవరి 5, 6, 7 తేదీల్లో వరంగల్లో నిర్వహించే PDSU 23వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున పాల్గొని మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.