ఫిడే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్లో కాంస్య పతకం సాధించిన తెలుగు తేజం అర్జున్ ఎరిగైసికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. అతని పోరాట స్పూర్తి ఎంతో గర్వకారణమని కొనియాడారు. ఇలాగే దృఢ సంకల్పంతో ఉంటూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.