GDWL: అధికారుల సమన్వయంతో గట్టు మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం అని నూతనంగా ఎన్నికైన గట్టు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు శ్రీరామ్ గౌడ్ అన్నారు. సోమవారం గట్టు మండల పరిషత్ కార్యాలయంలో ఆయన ఎంపీడీవో చెన్నయ్యను కలిసి తన ఎన్నికకు సంబంధించిన నియామక పత్రాన్ని అధికారికంగా అందజేశారు. ఎంపీడీవో మాట్లాడుతూ.. సర్పంచులు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.