KNR: హుజూరాబాద్ డివిజన్ పరిధిలోని ప్రజలు నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని ఏసీపీ మాధవి సూచించారు. ఈనెల 31న డ్రంక్ అండ్ డ్రైవ్, వాహనాల తనిఖీలు చేస్తామని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాత్రిపూట రోడ్ల మీద వేడుకలు నిర్వహించవద్దన్నారు. బహిరంగ ప్రదేశాల్లో టపాసులు పేల్చవద్దని అన్నారు.