కృష్ణా: గుడివాడలోని రామాలయం వద్ద ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా కోలాట ప్రదర్శనను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కళాకారులు లయబద్ధమైన అడుగులతో, కీర్తనల నడుమ కోలాటం ఆడుతూ.. ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపారు. ఈ వేడుకను వీక్షించేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మన సంస్కృతిని భావితరాలకు అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.