JN: స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ కమిషనర్‌ను బీజేపీ నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. మున్సిపల్ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని, ప్రతినెల కార్మికులకు సరైన సమయంలో వేతనాలను చెల్లించి వారి సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని నేతలు కోరారు. నేతలు సుభాష్, వెంకటరమణ, తదితరులు ఉన్నారు.