SKLM: ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ యూనియన్ 2వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఆర్టీసీ ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే శంకర్ హాజరై, వేడుకలను ప్రారంభించి యూనియన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల క్యాలెండర్ ఆవిష్కరించారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.