KNR: గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, జనవరి 27లోగా తమ ఎన్నికల ఖర్చుల వివరాలను సమర్పించాలని, చిగురు మామిడి ఎంపీడీవో ఓ ప్రకటనలో తెలిపారు. పోటీ చేసిన సర్పంచ్, వార్డు సభ్యులతో పాటు ఏకగ్రీవమైన వారు కూడ తుది ఖాతాలను మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అందజేయాలన్నారు. గడువులోగా వివరాలు ఇవ్వని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.