మనలో చాలా మందికి రోజంతా నిద్ర మత్తుగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం తగినంత నిద్ర లేకపోవడం, పోషకాహార లోపం. ముఖ్యంగా విటమిన్ B12, D, రక్తహీనత లేదా అధిక ఒత్తిడి వల్ల కూడా ఇలా జరుగుతుంది. అందుకే రోజూ తగినంత నీరు తాగుతూ.. సమయానికి పడుకుని, వ్యాయామం చేయడం ద్వారా దీనిని తగ్గించవచ్చు. సమస్య అధికంగా ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.