దీర్ఘశ్రేణి గైడెడ్ రాకెట్ పినాక ప్రయోగం విజయవంతమైంది. ఒడిశా చాందీపూర్ నుంచి డీఆర్డీవో ఈ ప్రయోగాన్ని చేసింది. పినాకకు 120 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యంతో దీన్ని రూపొందించారు. ఈ ప్రయోగం విజయవంతం అవ్వడం వల్ల సరిహద్దుల్లో శత్రువుల కదలికలను దూరం నుండే సమర్థవంతంగా అడ్డుకోవడానికి మన సైన్యానికి మరింత బలం చేకూరింది.