ప్రముఖ కన్నడ, తమిళ సీరియల్ నటి నందిని ఆత్మహత్య చేసుకుంది. APకి చెందిన ఆమె.. తమిళ సీరియల్ ‘గౌరీ’లో దుర్గ, కనకగా ద్విపాత్రాభినయంతో ఫేమస్ అయ్యింది. కాగా బెంగళూరులోని తన ఫ్లాట్లో ఆమె సూసైడ్ చేసుకోగా.. పెళ్లి విషయమై తల్లిదండ్రులు ఒత్తిడి చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అటు కొంతకాలంగా ఆమె డిప్రెషన్లో ఉన్నారని సన్నిహితులు తెలిపారు.