అభిమానం పెను విషాదాన్ని నింపింది. సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత, సినీ నటుడు విజయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 41 మంది మరణించారు. 50 మంది గాయపడ్డారు. మృతుల్లో 11 మంది చిన్నారులు ఉన్నారు. ఊహించని దానికంటే ఎక్కువ మంది రావడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.