వైకుంఠ ఏకాదశి(మంగళవారం) నేపథ్యంలో కళియుగ వైకుంఠం తిరుమల రంగురంగుల పుష్పాలు, విద్యుద్దీపాలంకరణతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆలయ ప్రాకారాలు, గోపురాలు విద్యుత్ కాంతులతో మిరమిట్లు గొల్పుతున్నాయి. ఈ పర్వదినాన తిరుమల వేంకటేశ్వరుడిని దర్శంచుకునేందుకు వేలాదిగా తరలి వస్తున్నారు.