AP: వేకంటేశ్వరస్వామి కొలువై ఉన్న ద్వారకా తిరుమల క్షేత్రంలో గిరిప్రదక్షిణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ తొలి మెట్టు నుంచి ప్రారంభమైన ఈ ప్రదక్షిణ శేషాచలం చుట్టూ సాగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు గోవింద నామస్మరణతో 6కి.మీ పాటు ప్రదక్షిణ చేశారు. ఈ మహోత్సవంతో 25 వేల మందికి పైగా భక్తులు పాల్గొన్నారు.