వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలంగాణ CM రేవంత్ తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా VIP బ్రేక్ దర్శనాల సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆయన వెంటన ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్, ఇతర ఆలయ సిబ్బంది ఉన్నారు. అంతకుముందు ఆయనకు TTD ఛైర్మన్ BR నాయుడు, ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికిన సంగతి తెలిసిందే. అటు ఇదే సమయంలో పలువురు VIPలూ వేంకటేశ్వరుడి దర్శనం చేసుకున్నారు.