జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ఆర్టీసీ డ్రైవర్ ముత్యం యాకయ్య విధి నిర్వహణలో భాగంగా డ్యూటీకి వెళ్తూ మార్గమధ్యలో పోగొట్టుకున్న రూ.1.02 లక్షల నగదు, ఐడీ కార్డు, పత్రాలు ఉన్న బ్యాగును పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో గుర్తించి సోమవారం అతనికి అప్పగించారు. చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ లింగారెడ్డి, హోంగార్డు మారయ్యలను అధికారులు అభినందించారు.