ADB: రాష్ట్రంలోని ప్రతి రైతుకు పంట అవసరాలకు సరిపడా యూరియాను తప్పనిసరిగా అందించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. సోమవారం యూరియా పంపిణీపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.