NZB: బాల్కొండ మండల కేంద్రంలోని శ్రీ భాష్యం పాఠశాలలో సోమవారం ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులు వివిధ రకాల రుచికరమైన వంటకాలు తయారు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ భూస రత్నాకర్ పౌష్టికాహారం పై విద్యార్థులకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఉన్నారు.