TG: నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకోవాలని సైబరాబాద్ CP నగర వాసులకు విజ్ఞప్తి చేసింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ‘క్యాబ్, ట్యాక్సీ, ఆటో డ్రైవర్లు యూనిఫాం ధరించాలి. ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉంచుకోవాలి. ప్రయాణికులు కోరినప్పుడు రైడ్‌ను నిరాకరిస్తే ఈ-చలాన్ ద్వారా రూ.500 జరిమానా విధిస్తాం’ అని స్పష్టం చేసింది.