కోనసీమ: మామిడికుదురు మండలం పాసర్లపూడి బాడవ వద్ద సోమవారం మత్స్యకారుల వలకు వింత చేప చిక్కింది. సుమారు మూడు అడుగులు పొడవున్న ఈ చేప మెడ వద్ద కొబ్బరాకులు ఉన్న గడులు ఉన్నాయి. మత్స్యకారుడు అంకాని బుజ్జి దానిని ముట్టుకున్నప్పుడు తిమ్మిరి ఎక్కడంతో అది విషపూరిత చేప ఏమో అని భయం వేసి తిరిగి గోదావరిలోకి వదిలేశాడు. ఈ వింత చేపను చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.