NZB: అలీసాగర్ ఎత్తిపోతల నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆమె ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లోని 48వేలకు పైగా ఎకరాల్లో అలీసాగర్ ఆధారంగా పంటలు సాగు చేస్తున్నారని గుర్తు చేశారు.