NRPT: ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్సై వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం నారాయణపేట పట్టణంలోని ఆటో స్టాండ్ వద్ద ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. డ్రైవర్లు లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని చెప్పారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదని సూచించారు.