NGKL: జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఇన్స్పైర్ బాల వైజ్ఞానిక ప్రదర్శనలు సోమవారం ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్ సంతోష్ ముఖ్య అతిథిగా హాజరై వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైజ్ఞానిక నూతన ఆవిష్కరణలకు చక్కటి వేదికవ్వాలని కలెక్టర్ అన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే కొత్త ఆలోచనలపై దృష్టి సారించాలని సూచించారు.