ATP: తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ నేతలు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపించారు. ఈ అక్రమాలపై నిష్పక్షపాత విచారణ కోరుతూ సర్పంచులు, ఎంపీటీసీలతో కలిసి అనంతపురం కలెక్టర్ ఆనంద్కు సోమవారం వినతిపత్రం సమర్పించారు. పనులు చేయకుండానే నకిలీ రికార్డులతో కోట్లాది రూపాయల బిల్లులు డ్రా చేశారని ఫిర్యాదు చేశారు.