SRD: సంగారెడ్డి మున్సిపాలిటీలో 40 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన నాలుగు చెత్త ట్రాక్టర్లను కలెక్టర్ ప్రావీణ్య సోమవారం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.