MDK: మనోహరాబాద్ మండలం కూచారం గ్రామ శివారులో అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్ను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. అనుమతి లేకుండా ఓ ప్రైవేట్ కంపెనీకి మట్టి తరలిస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో జీపీవో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ సమయంలో ఒక టిప్పర్ పట్టుబడగా, మిగతా వాహనాలు పరారయ్యాయి. పట్టుబడిన టిప్పర్ను తదుపరి చర్యల కోసం పోలీసులకు అప్పగించారు.