TG: రాష్ట్రంలో రబీ సీజన్‌కు సరిపడా యూరియా నిల్వలు ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గత సీజన్ కంటే 92 వేల మెట్రిక్ టన్నులు అధికంగా యూరియా అమ్మకాలు జరిగాయని మంత్రి చెప్పారు. 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఫెర్టిలైజర్ యాప్ విజయవంతం అయినట్లు తెలిపారు.