NZB: నందిపేట మండలం ఐలాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఆర్మూర్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సుధాకర్ ఆధ్వర్యంలో అడవులు, వన్య ప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో అడవులు, వన్యప్రాణుల పరిరక్షణ అత్యంత కీలకమన్నారు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం-1972 ప్రకారం వన్యప్రాణులను వేటాడటం నేరమని, అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.