BHPL: జిల్లా కలెక్టరేట్లోని ఐడీవోసీ కార్యాలయంలో GP ఎన్నికల అనంతరం మొదటిసారిగా ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రజావాణిలో కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొని.. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 56 దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.