ELR: విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సీఐ క్రాంతి కుమార్ అన్నారు. చింతలపూడి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాల్య వివాహాల నిర్మూలనలో పోలీసు పాత్రను ఆయన విద్యార్థులకు వివరించారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండి బాల్య వివాహాలను నివారించడంలో సామాజిక బాధ్యతను కలిగి ఉండాలని తెలిపారు.