చలికాలంలో అనేకమందిని చెవి నొప్పి సమస్య వేధిస్తుంది. చలి తీవ్రత లేదా చల్లటి గాలులవల్ల ఇది సంభవిస్తుంది. దీంతోపాటు జలుబు, జ్వరం, గొంతు నొప్పి, గొంతులో గరగర వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. అయితే తరచుగా చలిగాలుల మధ్య పనిచేయాల్సి రావడం, బైక్పై చల్లగా జర్నీ చేయడం వల్ల కూడా చెవి నొప్పి, చెవిపోటు వంటివి వచ్చే చాన్స్ ఎక్కువ.