భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో ఇవాళ వార్డెన్ భవాని ఓ విద్యార్థినిని కర్రతో తీవ్రంగా కొట్టిన ఘటన తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు హాస్టల్ వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. BRS జిల్లా నాయకుడు దినేష్ మాట్లాడుతూ.. విద్యార్థిని పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న వార్డెన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.