ప్రకాశం: వైసీపీవి మోసపు మాటలు అని ఎమ్మెల్యే కందులు నారాయణరెడ్డి మండిపడ్డారు. సోమవారం తర్లుపాడు మండలంలోని గానుగపెంట, పోతలపాడు గ్రామాలలో రైతన్న మీకోసం కార్యక్రమంలో మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తికాకుండానే చెవుల్లో పువ్వులు పెట్టారని, నీళ్లు రాకుండానే నీళ్లు వస్తున్నట్లు ఈ ప్రాంత ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజలు గ్రహించాలన్నారు.