ADB: 2023 బ్యాచ్‌కు చెందిన రాహుల్ కాంత్ ఐపీఎస్ సోమవారం పోలీసు ముఖ్యకార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. బీహార్ రాష్ట్రం పాట్నాకు చెందిన రాహుల్ 2023 బ్యాచ్‌లో నేషనల్ పోలీస్ అకాడమీ హైదరాబాద్‌లో శిక్షణ పొందారు. కాగా, 5 నెలల శిక్షణ నిమిత్తం ఆయన ఆదిలాబాద్‌కు వచ్చారు.