KMM: చింతకాని మండలంలో నూతన ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అటు ఈ కళాశాల నిర్మాణానికి గాను రూ.29 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు చెప్పారు. ప్రతి సంవత్సరం 60 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.