MNCL: జన్నారం మండల కేంద్రంలో గాయాల పాలైన మతిస్థిమితం లేని మహిళను ఆసుపత్రికి తరలించి కానిస్టేబుల్ శ్రీనివాస్ మంచి మనసును చాటుకున్నారు. బస్టాండ్ సమీపంలో మతిస్థిమితం లేక తిరిగే ఓ మహిళ చలి మంట వద్ద గాయపడింది. దీంతో కానిస్టేబుల్ శ్రీనివాస్ అక్కడికి చేరుకుని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో కానిస్టేబుల్ శ్రీనివాస్ గాయపడ్డ మహిళకు చికిత్స చేయించారు.