SRPT: యాసంగి సీజన్లో జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరత లేదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 10,508 మెట్రిక్ టన్నుల యూరియా వివిధ గోదాముల్లో అందుబాటులో అందుబాటులో ఉందన్నారు. 544 కేంద్రాల ద్వారా సరఫరా జరుగుతుందని, అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.