W.G: నూతన సంవత్సర వేడుకలను పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సూచించారు. వేడుకల పేరుతో రోడ్లపై హంగామా చేసినా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ నిఘా ఏర్పాటు చేశామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించబోమని స్పష్టం చేశారు.