WGL: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం నర్సంపేట ఎమ్మెల్యే శ్రీ దొంతి మాధవరెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీ వేంకటేశ్వర స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు కలిశారు.