ఖమ్మం జిల్లాలో ప్రతి యూరియా షాపు వద్ద వాలంటీర్లను ఏర్పాటు చేశామని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రతి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, ప్రైవేట్ డీలర్ల నుంచి రైతులకు యూరియా పంపిణీకి పటిష్ట చర్యలు తీసుకున్నామని చెప్పారు. అటు మార్క్ ఫెడ్ వద్ద మరో 8 వేల 100 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు.