RR: షాద్నగర్ పట్టణంలో నేరాలకు అడ్డుకట్ట వేసే దిశగా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. పట్టణ కేంద్రంలోని ఎలికట్ట చౌరస్తాలో ఎస్సై రామచందర్ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాల తనిఖీలు చేశారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో గస్తీ పెంచడంతోపాటు అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.