అన్నమయ్య: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా ఆహార భద్రతా అధికారి డా.కె.షమీమ్ బాషా సోమవారం చిట్వేల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చిల్లర, కూల్డ్రింక్స్, కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లను పరిశీలించారు. ఒక కూల్డ్రింక్స్ షాపు, ఒక సూపర్ మార్కెట్లో కాలం చెల్లిన ఆహార పదార్థాలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దుకాణదారులకు నోటీసులు జారీ చేశారు.