W.G: విశాఖపట్నంలో జరిగిన 63వ నేషనల్ స్కేటింగ్ ఇన్ లైన్ హాకీ, రోలర్ హాకీ విభాగాల్లో పతకాలు గెలుపొందిన క్రీడాకారులను సోమవారం కలెక్టర్ నాగరాణి అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించి క్రీడలలో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలన్నారు. మన జిల్లా క్రీడాకారులు ఒక బంగారు పతకం, ఆరు వెండి పథకాలు, ఒక రజిత పతకం మొత్తం ఎనిమిది పతకాలు సాధించారన్నారు.