శ్రీకాకుళం: ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలని జిల్లా కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికారి సంస్థ ఛైర్మన్ జూనైద్ అహ్మద్ మౌలానా పేర్కొన్నారు. సోమవారం గార మండలం అంపోలు జిల్లా జైలును జైలుబోర్డు అధికారులతో సందర్శించారు. కులవివక్షత జైల్లో జరుగుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. ఖైదీలు సామాజిక పౌరులుగా మెలగలన్నారు. ఆయన వెంట ఎస్పీ కూడా ఉన్నారు.