మేడ్చల్ పోలీస్ స్టేషన్లో నమోదయిన POSCO కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, 5వేల జరిమానా విధిస్తూ మేడ్చల్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు తీర్పునిచ్చిందని అడిషనల్ PP విజయ రెడ్డి మీడియాతో తెలిపారు. 2022లో మైనర్ బాలిక(15)ను ఒరిస్సా కు చెందిన బికాస్ కుమార్ నాయక్ అత్యాచారం చేశాడని, 13మంది సాక్షులను విచారించిన కోర్టు ఈ తీర్పునిచ్చిందని PP వెల్లడించారు.