NDL: అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లు పూర్తయ్యాయని మఠం ప్రతినిధులు తెలిపారు. రేపు భక్తుల కోసం ప్రత్యేకంగా ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉత్తర ద్వారం వద్ద బారికేడ్లు నిర్మించి, మండపాలకు రంగురంగుల పూలతో అలంకరణలు చేశారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు.