TG: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లవుతున్నా.. ఇప్పటికీ ఒక్క హామీ నెరవేరలేదని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. రైతుబంధులు వచ్చే కాలం పోయి.. రాబందు పాలన వచ్చిందని మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో కొత్త సర్పంచులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కేటీఆర్.. పత్తి పంట కొనుగోలు చేసే పరిస్థితి కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో లేదన్నారు.