GDWL: ప్రజల భద్రతే మా ప్రాధాన్యత, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు అని గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. 2026 నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో సోమవారం ఆయన పలు కీలక నిబంధనలను ఓ ప్రకటనలో విడుదల చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరంగా ఉంటాయని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించరాదన్నారు.